సీఎం కేసీఆర్ కు రెండు రాకెట్లను బహూకరించిన పీవీ సింధు

  • ప్రగతిభవన్ లో కేసీఆర్ ను కలిసిన సింధు
  • సింధును మనస్ఫూర్తిగా అభినందించిన కేసీఆర్
  • సింధు దేశగౌరవాన్ని నిలబెట్టిందంటూ వ్యాఖ్యలు
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టైటిల్ నెగ్గి ప్రతి భారతీయుడు ఉప్పొంగిపోయేలా చేసిన తెలుగుతేజం పీవీ సింధుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసింది. హైదరాబాద్ లోని ప్రగతిభవన్ కు వెళ్లిన సింధు సీఎం కేసీఆర్ ను కలిసి తన విజయానందాన్ని ఆయనతో పంచుకుంది. అనంతరం సీఎం కేసీఆర్ కు సింధు రెండు బ్యాడ్మింటన్ రాకెట్లను బహూకరించింది.

ఈ సందర్భంగా కేసీఆర్ మనస్ఫూర్తిగా సింధును అభినందించారు. సింధు దేశగౌరవాన్ని నిలబెట్టిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విజేతలను తయారు చేసే వేదికలా మారిందని అన్నారు. భవిష్యత్తులో సింధు పాల్గొనే టోర్నమెంట్లకు ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు ఉంటాయని, సింధుకు మున్ముందు అన్ని విధాలా సాయం అందిస్తామని తెలిపారు.
Go Back to Shorts
KCR
PV Sindhu
Telangana
Hyderabad

More Telugu News